- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ మరో ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే వీడియో కాల్ ద్వారా మాట్లాడునే అవకాశం ఉండేది. కానీ తాజాగా ఒకేసారి ఎనిమిది మంది మాట్లాడుకునే అవకాశం కల్పించింది.
కరోనా వైరస్ నేపథ్యంలో వాయిస్, వీడియో కాలింగ్ చేసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీంతో ఒకేసారి ఎనిమిది మంది వాయిస్ లేదా వీడియో కాల్ చేసుకునే అవకాశం కల్పించినట్లు వాట్సాప్ వెల్లడించింది.
- Advertisement -