విజయ నిర్మల బయోపిక్..పుకార్లకు బ్రేక్!

247
vijaya nirmala
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటి, దర్శకురాలు విజయనిర్మల. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయ గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించిన విజయ నిర్మల బయోపిక్‌పై కొంతకాలంగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే.

విజయ నిర్మల కొడుకు నరేష్‌..బయోపిక్‌ తెరకెక్కించే పనిలో ఉన్నారని వార్తలు వెలువడుతుండగా ఆ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టారు నరేష్. ప్ర‌స్తుతం అమ్మ బ‌యోపిక్‌ని తీయాల‌నే ఆలోచ‌న లేదని.. ఎవరికీ కూడా ప‌ర్మీష‌న్స్ ఇవ్వ‌లేదని తేల్చి చెప్పారు.

విజ‌య నిర్మ‌ల బయోపిక్‌ కోసం కీర్తి సురేష్‌ని సంప్రదిస్తే ఆమె ఓకే చెప్పారని ప్రచారం జరుగుతుండగా వాటికి ఆదిలోనే పుల్ స్టాప్ పెట్టేశారు నరేష్. దీంతో ఇప్పటికైనా పుకార్లకు చెక్ పడుతుందో లేదో వేచిచూడాలి.

- Advertisement -