వాట్సాప్ లో వెంటనే..ఈ సెట్టింగ్స్ ఆన్ చేయండి!

33
- Advertisement -

నేటి రోజుల్లో వాట్సప్ ద్వారా ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మాల్వేర్ ఉన్న లింక్స్ ను వాట్సాప్ ద్వారా షేర్ చేస్తూ వాటిని క్లిక్ చేసిన వారి మొబైల్ ను హ్యాక్ చేస్తున్నారు హ్యాకర్స్. ముఖ్యంగా వాట్సప్ గ్రూప్స్ ద్వారా మాల్వేర్ లింక్స్ ఎక్కువగా షేర్ అవుతుంటాయి. అందుకే వాట్సప్ గ్రూప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. వాట్సప్ లో మనకు అవసరమైన గ్రూప్స్ తో పాటు అనవసర గ్రూప్స్ కూడా తెలియకుండానే యాడ్ అవుతుంటాము. ఇలా తెలియని గ్రూప్ లో యాడ్ అయినప్పుడు మొబైల్ హ్యాక్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తెలియని గ్రూప్స్ లోకి మన నెంబర్ వెళ్లకుండా వాట్సప్ లోని కొన్ని సెట్టింగ్స్ ద్వారా జాగ్రత్త పడవచ్చు. అవేంటో తెలుసుకుందాం !

ముందుగా వాట్సాప్ ఆన్ చేసిన తర్వాత పైన త్రీ డాట్స్ ను క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. అక్కడ ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోవాలి. కాస్త కిందకు స్కోల్ చేస్తే గ్రూప్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మై కాంటాక్ట్ ఆప్షన్ ఒకే చేయాలి. ఇలా చేయడం వల్ల కేవలం మీ కాంటాక్ట్ లో ఉన్నవారు మాత్రమే మిమ్మల్ని గ్రూప్ లోకి యాడ్ చేసే వీలు ఉంటుంది. తద్వారా అసంబంధిత గ్రూప్స్ లోకి మన నెంబర్ వెళ్లకుండా సేఫ్ గా ఉంటుంది. అయితే ఈ సెట్టింగ్స్ తో పాటు మరో సెట్టింగ్ కూడా చేసుకోవడం చాలా ముఖ్యం. ఇదే ప్రైవసీ ఆప్షన్ లో కిందకు స్క్రోల్ చేస్తే అడ్వాన్స్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ను ఆన్ లో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఐపీ అడ్రస్ హ్యాకర్స్ బారిన పడకుండా సేఫ్ గా ఉంటుంది.

ఇలా ఈ రెండు సెట్టింగ్స్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసుకోవాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. నేటిరోజుల్లో పెరిగిపోతున్న వాట్సప్ మోసలను అరికట్టలంటే ప్రతిఒక్కరూ వాట్సప్ ప్రైవసీ విషయంలో జాగ్రత్తగా ఉండక తప్పదని టెక్ నిపుణులు చెబుతున్న మాట.

Also Read:‘కారు జోరు’ గ్యారంటీ !

- Advertisement -