ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ మరో అదిరే ఫీచర్‌ని తీసుకొచ్చింది.
లాక్‌చాట్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తాము కోరుకుంటున్న చాట్‌ను ఇతరులకు కనిపించకుండా చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న కాంటాక్ట్‌ను పాస్‌వర్డ్ లేదా ఫింబర్ ప్రింట్‌తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.అంతేకాదు మీరు ప్రొటెక్ట్ చేసుకున్న కాంటాక్ట్ చాట్ బాక్స్‌లో కూడా కనిపించదు.
Also Read:తమలపాకుతో ఆరోగ్యం…
మొదట మీ వాట్సాప్ను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.
మీరు ఏ చాట్ని లాక్ చేయాలని భావిస్తున్నారో దాని ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయాలి.
మీకు కొత్తగా ‘చాట్ లాక్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది డిసప్పియరింగ్ మెసేజ్ మెనూ కింద కనిపిస్తుంది.
ఇప్పుడు చాట్ లాక్ ను ఎనేబుల్ చేయాలి. ఇందుకోసం మీరు పాస్ వర్డ్ లేదంటే ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి.
వెంటనే చాట్ లాక్ అవుతుంది.
లాక్ చేసిన చాట్ను చూడాలంటే మీ వాట్సాప్ హోం పేజ్ని కిందకి స్వైప్ చేయాలి.
మీ పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే చాట్ లాక్ కనబడుతుంది.
Also Read:IPL 2023:ఐదోసారి విజేతగా చెన్నై