వాట్సప్ కు గ్రహణం…వీడింది

396
- Advertisement -

వాట్సప్‌ లేకపోతే రెండు గంటలు ప్రపంచం స్తంభించిపోయింది. అవునండీ దాదాపుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వాట్సప్‌ స్తంభించింది. కానీ మెటా కంపెనీ మాత్రం రెండు గంటల్లో పునరద్ధరించారు. మధ్యాహ్నం 12.30 నిమిషాల నుండి పని చేయని వాట్సాప్ సేవలు…. తిరిగి 2.18 నిమిషాల నుండి ప్రారంభమైనట్లు మెటా కంపెనీ ప్రకటించింది. దీంతో అందరికి మెసేజ్‌లు వెళుతున్నట్లు యూజర్లు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

యూజర్లు మెసేజ్‌లు పంపలేకపోతున్నట్లు తమ దృష్టికి రావడంతో సమస్యను గుర్తించి పరిష్కరించినట్లు మెటా కంపెనీ ప్రతినిధి చెప్పారు. సర్వర్‌ డౌన్‌ కావడమే కారణమని అందుకు గల టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ను గుర్తించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన లోపాన్ని టెక్నికల్‌ ఎక్స్‌ పర్ట్స్‌ ద్వారా వాట్సప్‌ను త్వరగా రీస్టోర్‌ చేశామని వెల్లడించారు.

- Advertisement -