- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ సరికొత్త ఫీచర్స్‌తో ముందుకొచ్చింది.
ఇప్పటికే వాట్సాప్‌లో గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు కేవలం 4గురికి మాత్రమే వాయిస్,వీడియో కాల్ చేసే సౌకర్యం ఉండగా ఇప్పుడు ఆ పరిమితిని 8కి పెంచింది.
అలాగే, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కొత్త కాంటాక్ట్స్‌ను జోడించుకునే అవకాశంతో పాటు 24 గంటల్లో స్టోరీలు, స్టేటస్‌లు అదృశ్యమయ్యేలా సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజెస్ ఫీచర్‌ను త్వరలో అందించనుంది వాట్సాప్.
- Advertisement -