యూజర్ల ప్రైవసీపై మరింత క్లారిటీ ఇచ్చిన వాట్సాప్..!

247
whatsapp
- Advertisement -

యూజర్ల ప్రైవసీపై మరింత క్లారిటీ ఇచ్చింది వాట్సాప్. యూజర్ల వ్యక్తిగత సంభాషణల డేటా గోప్యత పాటించేందుకు తాము కట్టుబడి ఉన్నామని భారత ప్రభుత్వానికి తేల్చి చెప్పింది వాట్సాప్‌. కొత్త ప్రైవసీ పాలసీని ముందుగా ప్రకటించినట్లు మే 15 నుంచి అమల్లోకి తేనున్నట్లు తెలిపింది.

తప్పుడు ప్రచారం, యూజర్ల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ బట్టి వాట్సాప్‌ సర్వీసుల నిబంధనలను అంగీకరించేందుకు ఉద్దేశించిన గడువును మే 15 దాకా పొడిగించాం. ఈలోగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. వారి ప్రశ్నలకు సమాధానమిస్తున్నాం అని వాట్సాప్‌ ఒక బ్లాగ్‌పోస్టులో పేర్కొంది.

ఒకవేళ మే 15 నాటికి కూడా కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించకపోయినా ఆయా యూజర్లు .. కాల్స్, నోటిఫికేషన్స్‌ పొందవచ్చని, కానీ మెసేజీలు పంపాలంటే మాత్రం అప్‌డేట్‌కి అంగీకరించాల్సి ఉంటుందని వాట్సాప్‌ స్పష్టం చేసింది.

వాట్సాప్‌ డేటాను ఫేస్‌బుక్‌తో పాటు ఇతర గ్రూప్‌ కంపెనీలతో పంచుకునే విధంగా వాట్సాప్‌ అప్‌డేట్‌ పాలసీని ప్రకటించగా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం కూడా వాట్సాప్‌కు గట్టివార్నింగ్ ఇచ్చింది. భారత యూజర్ల ప్రైవసీని గౌరవించాలని తేల్చి చెప్పిన కేంద్రం… వెంట‌నే కొత్త ప్రైవ‌సీ పాల‌సీని ఉప‌సంహ‌రించుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది.

- Advertisement -