రాష్ట్రంలో 24 గంటల్లో 157 కరోనా కేసులు..

13
corona

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒక్కరు మరణించలేదు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,435కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 1715 యాక్టివ్ కేసులుండగా 2,94,097 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 84,33,333 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.