వైట్ ఫంగస్…లక్షణాలెంటో తెలుసా…?

44
white fungus

ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న ప్రజలకు ఇది నిజంగా చేదువార్తే. కరోనా సోకిన వారిని బ్లాక్ ఫంగస్ రూపంలో మృత్యువ కబళించే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్న సమయంలోనే మరో కొత్తరకం వైరస్ వెలుగు చూసింది. అదే వైట్ ఫంగస్‌.

ఈ వైరస్ సోకిన వారిలో నోటిలో అంగిలి, నాలుక, చర్మం, జననేంద్రియాలు.. తదితర ప్రాంతాల్లో తెల్లటి మచ్చలు వస్తాయి. అందువల్ల దీనిని వైట్‌ ఫంగస్‌ అని పిలుస్తారని దీని అసలు పేరు కాండిడా అల్బికాన్స్ అని వెల్లడించారు వైద్య నిపుణులు.

కరోనాకు స్టెరాయిడ్లు అతిగా వాడి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడినప్పుడు, షుగర్‌ లెవల్స్‌ తీవ్రంగా పెరిగిపోయినప్పుడు ఇది దాడి చేస్తుందని వెల్లడించారు. వైట్‌ ఫంగస్‌ పెరుగుదలను అడ్డుకునే పరిస్థితి లేకుంటే చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కరోనా సోకి ఆక్సిజన్‌ తీసుకుంటున్న వారికి ఆ పైపుల ద్వారా ఊపిరితిత్తులలోకి, నోటిలోకి ఈ ఫంగస్‌ ప్రవేశించి ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

వైట్‌ ఫంగస్‌ ఊపిరితిత్తులతో పాటు కడుపు, పేగులు, కిడ్నీలు, చర్మం, గోర్లు, జననేంద్రియాలకూ సోకుతుందని మహిళలు, చిన్న పిల్లల్లో ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని వెల్లడించారు. నోటిలో, గొంతులో, నాలికపై కురుపులు, తెల్లని మచ్చలు ఏర్పడటం, సైనస్‌ వాపు, గొంతునొప్పి,తీవ్రంగా ఆయాసం ఉంటుందని వెల్లడించారు. వైట్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ తగ్గడానికి యాంటీ ఫంగల్‌ ఔషధాలు, ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుందని…. అదే సమయంలో తగిన పోషకాహారం తీసుకోవడం మంచిదని తెలిపారు డాక్టర్లు.