క్యాష్‌ లెస్‌ కు రాయితీ…..

213
What did the FM announce
- Advertisement -

పాత పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు 20 నుంచి 40 శాతానికి పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నగదు లావాదేవీలు ఖర్చుతో కూడుకున్నవని, అందుకే క్యాష్ లెస్‌ లావాదేవీలు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పాత పెద్ద నోట్లు రద్దు చేసి నేటికి నెల రోజులు పూర్తవడంతో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. షెడ్యూల్‌ ప్రకారం నగదును అన్ని ప్రాంతాలను ఆర్బీఐ సరఫరా చేస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు పలు రాయితీలు ఇస్తున్నట్టు జైట్లీ ప్రకటించారు.

రాయితీలు ఇలా …
* డిజిటల్‌ చెల్లింపుల ఫ్లాట్‌ఫామ్స్‌ ద్వారా డీజిల్‌, పెట్రోలు కొనుగోలు చేసేవారికి 0.75% రాయితీ లభిస్తుంది. ప్రస్తుతం రోజుకు 4.5 కోట్ల మంది రూ.1,800 కోట్ల ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. డిజిటల్‌ చెల్లింపుల ద్వారా రూ.2 లక్షల కోట్లు విలువైన లావాదేవీలు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

* డిజిటల్‌ విధానంలో సబర్బన్‌ రైల్వే నెలవారీ పాసులు తీసుకొనే వారికి జనవరి 1, 2017 నుంచి 0.5 శాతం రాయితీ ఇస్తారు. తొలుత ముంబయి సబర్బన్‌ నుంచి ప్రారంభిస్తారు.

* ఆన్‌లైన్‌ విధానంలో రైల్వే టిక్కెట్లు కొనేవారికి రూ.10,00,000 విలువైన బీమా వర్తిస్తుంది.

What did the FM announce

* రైల్వేలో భోజనం, వసతి గదులు బుక్‌ చేసుకొనేవారికి 5% రాయితీ ఇస్తారు.

* వెబ్‌సైట్ల ద్వారా ప్రభుత్వ సంస్థల్లో సాధారణ, జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేసేవారికి ప్రీమియంలో 8-10% రాయితీ ఇస్తారు.

* కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్న వారికి నాబార్డ్‌ రూపే కార్డులు ఇస్తుంది.

* ప్రజలను డిజిటల్‌ చెల్లింపులు చేసేలా ప్రోత్సహించేందుకు 10,000 జనాభా దాటిన ప్రతి గ్రామానికీ రెండు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (స్వైపింగ్‌) యంత్రాలు ఇఇస్తారు. దేశంలోని లక్ష గ్రామాలకు వీటిని సరఫరా చేస్తారు.

* హైవే టోల్‌గేట్స్‌ వద్ద ఆర్‌ఎఫ్‌ఐడీ, డిజిటల్‌ విధానంలో చెల్లింపులు చేస్తే 10% రాయితీ ఇస్తారు.

* ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలను నగదు రహిత లావాదేవీలు బాట పట్టించేందుకు, ప్రజావసరాల కోసం కార్డులు వినియోగించే వారిపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ భారం మోపరు.

* పీవోఎస్‌ యంత్రాలు, మైక్రో ఏటీఎమ్‌లు, మొబైల్‌ పీవోఎస్‌లు వినియోగించే వారి వద్ద నెలవారీ రుసుము రూ.100 తీసుకోరాదని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది. చిన్న తరహా వ్యాపారులను నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైట్లీ తెలియజేశారు.

- Advertisement -