పొచంపల్లి చేనేత పార్కును సందర్శించిన కేటీఆర్…

90

చేనేత ఉత్పత్తులకు,… చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి కె. టీ రామరావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి టెక్స్ టైల్ పార్క్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు సందర్శించారు. చేనేత కార్మికులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మల్కాపూర్ వద్ద ఉన్న టెక్స్ టైల్ పార్కుని సైతం మంత్రి సందర్శించారు. చేనేతకు ప్రభుత్వ సహాకారం, ప్రత్యేక పాలసీని తీసుకవస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. ఈ దిశగా ప్రయత్నాలు పూర్తి కావడానికి వచ్చాయన్నారు. వ్యవసాయం తర్వత అధికంగా ప్రజలకు ఉపాది కల్పిస్తున్న రంగం చేనేత రంగమని మంత్రి అన్నారు.

Minister KTRama Rao visit Pochampally

తెలంగాణ చేనేత కేంద్రలైన పోచంపల్లి, గద్వాల వంటి ప్రాంతాల చేనేత ఉత్పత్తులకు ప్రపంచంలోనే గుర్తింపు ఉందన్నారు మంత్రి కేటీఆర్. చేనేత ఒక కళ అని, చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 2000 వేల మగ్గాలకు గాను 250 మాత్రమే పనిచేస్తున్నాయని, పొచంపల్లి పార్కుని అభివృద్ది చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను కార్మికుల నుంచి అడిగి తెలుసుకున్నామని మంత్రి తెలిపారు. మొత్తం చేనేత వస్త్రాల తయరీ ప్రక్రియను క్షుణ్ణంగా అర్థం చేసేకునేందుకే ఇక్కడ పర్యటించానని, ఈ పార్కు పూర్తి స్థాయి సామర్ధ్యంతో పని చేసేందుకు అవసరమైన నిధులు, ప్రభుత్వ పరమైన ఇతర కార్యక్రమాలను చేపడతామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

Minister KTRama Rao visit Pochampally

చేనేత ఉత్పత్తులకు ఇప్పటికే ఆన్ లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించామని..రానున్న రోజుల్లో దానిని మరింత విస్తృతం చేస్తామని, ఇందుకోసం అన్ని ఈ కామర్స్ వెబ్ సైట్లతో మాట్లాడుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. యాదాద్రితో పాటు దగ్గర మల్కాపూర్ వద్ద జాతీయరహదారిపై పోచంపల్లి చేనేత ఉత్పత్తుల ఔట్ లెట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. అటు ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసే హస్తకళల కేంద్రం గోల్కోండలోనూ చేనేత ఉత్పత్తులకు స్థానం కల్పిస్తామన్నారు. పార్కులో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం అవసరం అయిన అరోగ్య భీమా, పించన్ల వంటి కార్యక్రమాలను చేపడతామని, ఇలాంటి అన్ని అంశాలతో సమగ్ర చేనేత పాలసీ తీసుకువస్తున్నట్లు తెలిపారు.

Minister KTRama Rao visit Pochampally

మొత్తంగా చేనేత కార్మికులకు మరిన్ని ఉపాది, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు అన్ని రకాల సహాకారం అందిస్తామని, ఈ విషయంలో కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో 12 కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు, బడ్జెట్ లో మరింత బడ్జెట్ పెంచేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి కేటీఆర్‌ హమీ ఇచ్చారు. వారంలో ఒకరోజైనా చేనేత వస్త్రాలను ధరించాలని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కోరుతామన్నారు.

Minister KTRama Rao visit Pochampally

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తమ కుటుంబ సభ్యుల కోసం పోచంపల్లి చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా తన డెబిట్ కార్డుతో క్యాష్ లెస్ విధానంలో బిల్లు చెల్లించారు.