ప్రతీ గ్రామానికి భగీరథ నీరు: మంత్రి ఎర్రబెల్లి

114
errabelli

ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీటిని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి మిషన్ భగీరథ పథకంపై సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ పనులు, పలు అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సమీక్షకు ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సభర్వాల్ హాజరైయ్యారు.

మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అన్ని ఊర్లకు ప్రతి రోజూ నీటి సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా స్టెబిలైజేషన్ ను చేస్తున్నాం.స్టెబిలైజేషన్ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతీ గ్రామానికి భగీరథ నీరు సరఫరా చేయాలి. గ్రామంలోని ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టకుండా ప్రతి ఇంటికి నల్లా ను బిగించాలని తెలిపారు. గ్రామంలోని వైకుంఠ దామాలు, డబుల్ బెడ్ రూమ్ కాలనీ లకు నీటి కనెక్షన్ ఇవ్వాలి స్టెబిలైజేషన్ లో వెనుకబడ్డ జిల్లాల చీఫ్ ఇంజనీర్లు ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి పని చేయండి అని మంత్రి సూచించారు.

minister errabelli