బరువు పెంచే ఆహార పదార్థాలు!

127
- Advertisement -

నేటి రోజుల్లో అధిక బరువు ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారో అదేవిధంగా బరువు తక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్ పెంచుకోవడానికి అన్నే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొందరు కొద్దిగా ఆహారం తీసుకున్న వెంటనే బరువు పెరుగుతూ ఉంటారు.. మరికొందరు ఎంత ఆహారం తిన్న బరువు మాత్రం పెరగరు. ఇలా వయసుకు తగ్గ రీతిలో బరువు పెరగకపోవడానికి ఎన్నో కారణలే ఉన్నాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం సరైన పోషకాలు లేకపోవడం, అలాగే జన్యుపరంగా ఉండే లోపం కారణంగా కూడా సరైన బరువు ఉండరు. దాంతో బరుపు పెరగడానికి మార్కెట్ లో దొరికే మెడిసన్స్, వెయిట్ గెయిన్ పౌడర్స్ వాడుతూ ఉంటారు. అయితే ఇవేవీ కాకుండా సహజంగానే బరువు పెంచడానికి తగిన ఆహార పదార్థాలు తీసుకుంటే ఇట్టే బరువు పెంచుకోవచ్చు. అవేంటో చూద్దాం !

1. వేరుశనగ పప్పు

వెయిట్ గెయిన్ చేయడంలో వేరుశనగ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవ్వన్ని కూడా శరీర బరువును పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి. అందువల్ల ప్రతిరోజూ 50 గ్రాముల పచ్చి వేరుశనగ పప్పులను రాత్రి నానబెట్టి ఉదయం ఖర్జూర పండుతో కలిపి తీసుకుంటే చక్కగా బరువు పెరగవచ్చు. ఇలా కాకుండా వేరుశనగలను బెల్లంతో కలిపి కూడా తీసుకోవచ్చు.

2. గుడ్డు

గుడ్డు సర్వపోషకాల సమ్మేళనం. అందుకే ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూఉంటారు. గుడ్డులో క్యాలరీలు, ప్రోటీన్స్, విటమిన్ బి6, విటమిన్ కె వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన పోషణ అందించి చక్కగా బరువు పెరిగేలా చూస్తాయి. అందువల్ల రోజుకు ఉదయం సాయంత్రం కనీసం రెండేసి గుడ్లు తింటే ఈజీగా బరువు పెరగవచ్చు.

3. పండ్లు

బరువు పెంచడం లో వివిద రకాల పండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆసన, మామిడి, సీతాఫలం,అరటి వంటి పండ్లు వెయిట్ గెయిన్ కు చక్కటి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా అరటి పండును ప్రతిరోజూ ఉదయం సాయంత్రం తినడం వల్ల చక్కగా వెయిట్ పెరుగుతారు. ఎందుకంటే అరటిపండు ఎన్నో పోషకాల మిశ్రమం.

4. వెయిట్ పెరగాలనుకునే వారు అన్నం ఎక్కుగాగా తినాలి. రైస్ లో ఫైబర్, పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల అన్నంతో పాటు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఇక శరీర బరువు పెంచడంలో పెరుగన్నం ఎంతో ముఖ్యమైనది. ప్రతిరోజూ ఉదయం మరియు రాత్రి పూట పెరుగన్నం తింటే త్వరగా బరువు పెరగవచ్చని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.

5. రెండు అరటిపండ్లు, 7 బాదంలు, 8 ఎండు ద్రాక్షలు అలాగే వేడి చేసి చల్లార్చిన ఒక గ్లాస్ చిక్కటిపాలు మిక్సీ చేసుకొని ప్రతిరోజూ ఉదయం సాయంత్రం తాగడం వల్ల త్వరగా బరువు పెరగవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు బరువు పెరగడానికి వ్యాయామం కూడా ఎంతో అవసరం.

Also Read:ఢిల్లీ దొరలు వర్సెస్ తెలంగాణ ప్రజలు!

- Advertisement -