నోట్ల రద్దు..మోడీ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల్లో ఒది ఒకటి. బ్లాక్ మనీని వెనక్కితీసుకొస్తామని షాకింగ్ నిర్ణయం తీసుకున్న మోడీ…పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఒక్క నిర్ణయంతో దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు ధనిక, వ్యాపార, ఉద్యోగ వర్గాలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. డబ్బుల కోసం క్యూ లైన్లలో నిలుచోని చనిపోయిన వారెందరో.
ఇక ఈ నోట్ల రద్దుపై ట్విట్టర్ వేదికగా స్పందించారు మంత్రి కేటీఆర్. మోడీ సర్కార్ తీసుకున్న ఈ డీమోనిటైజేషన్ నిర్ణయం ఘోరమైన వైఫల్యం అన్నారు. పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో మరచిపోవద్దన్నారు. ఈ ఒక్క నిర్ణయం వరుసగా 8 సంవత్సరాల పాటు ఆర్ధిక వ్యవస్థ మందగమానానికి దారితీసిందన్నారు. ఇక తర్వాత తీసుకొచ్చిన లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థకు మరింత దెబ్బ తగిలిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
What a colossal failure this Demonetisation was & let’s not forget how it crippled the growing Indian economy
This half-baked idea led to 8 consecutive quarters of slowdown, subsequently landing in Lockdown in 2020 serving a body blow to the vibrant economy https://t.co/8fW8f1pjoN
— KTR (@KTRTRS) November 7, 2022
ఇవి కూడా చదవండి..