క్రికెట్ వెస్టిండీస్ (CWI) తమ దేశంలో జరగబోయే రాబోయే హోమ్ సీజన్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో భాగంగా శ్రీలంక, న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్లతో వెస్టిండీస్ సిరీస్‌లు ఆడనుంది. అలాగే ఈ ఏడాది విండీస్ జట్టు శ్రీలంక, పాకిస్తాన్‌లలో పర్యటించనుంది కూడా.
వెస్టిండీస్ జట్టు జూన్ 3 నుండి 14 వరకు జమైకాలో శ్రీలంకతో వన్డే (ODI), టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత జూన్ 25 నుండి యాంటిగ్వా అండ్ బార్బుడాలో టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇక జూలై 11 నుండి 21 వరకు న్యూజిలాండ్ జట్టుతో వెస్టిండీస్ ఐదు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.
ఆ తర్వాత జూలై 25 నుండి ఆగస్టు 6 వరకు పాకిస్తాన్‌తో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. శ్రీలంక, పాకిస్తాన్‌లతో జరిగే ఈ టెస్ట్ మ్యాచ్‌లు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భాగం కావడం గమనార్హం. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో ఉంది.
న్యూజిలాండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు గయానా మాత్రమే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి వచ్చింది.
ఐదు వన్డేల నిర్వహణకు ఎదురవుతున్న లాజిస్టికల్ సవాళ్లపై గయానా ప్రభుత్వంతో క్రికెట్ వెస్టిండీస్ చర్చలు జరిపింది. ఈ మ్యాచ్‌లను మరియు వాటి నిర్వహణ ఖర్చులను ఇరు ప్రాంతాల మధ్య పంచుకోవడానికి గయానా, బార్బడోస్ ప్రభుత్వాలు పరస్పర ఒప్పందానికి వచ్చాయి అని సీడబ్ల్యూఐ (CWI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ డెహ్రింగ్ తెలిపారు.
వెస్టిండీస్ హోమ్ సీజన్ పూర్తి షెడ్యూల్..
శ్రీలంక టూర్ (వెస్టిండీస్‌లో):
జూన్ 3: మొదటి వన్డే – సబీనా పార్క్, జమైకా
జూన్ 6: రెండో వన్డే – సబీనా పార్క్, జమైకా
జూన్ 9: మూడో వన్డే – సబీనా పార్క్, జమైకా
జూన్ 11: మొదటి టీ20 – సబీనా పార్క్, జమైకా
జూన్ 13: రెండో టీ20 – సబీనా పార్క్, జమైకా
జూన్ 14: మూడో టీ20 – సబీనా పార్క్, జమైకా
జూన్ 25-29: మొదటి టెస్ట్ – సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, యాంటిగ్వా & బార్బుడా
జూలై 3-7: రెండో టెస్ట్ – సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, యాంటిగ్వా & బార్బుడా
Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!
న్యూజిలాండ్ టూర్ (వెస్టిండీస్‌లో):
జూలై 11: మొదటి వన్డే – గయానా నేషనల్ స్టేడియం, గయానా
జూలై 13: రెండో వన్డే – గయానా నేషనల్ స్టేడియం, గయానా
జూలై 16: మూడో వన్డే – గయానా నేషనల్ స్టేడియం, గయానా
జూలై 19: నాలుగో వన్డే – కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
జూలై 21: ఐదో వన్డే – కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
పాకిస్తాన్ టూర్ (వెస్టిండీస్‌లో):
జూలై 25-29: మొదటి టెస్ట్ – బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో
ఆగస్టు 2-6: రెండో టెస్ట్ – క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో

