బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ‘అబ్సెషన్’ (Obsession). కేవలం 0.75 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.2 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా థియేటర్లలో విడుదలైన కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 830 కోట్లు) కలెక్షన్లతో రికార్డు మైలురాయిని దాటింది.
ప్రసిద్ధ యూట్యూబర్ మరియు 26 ఏళ్ల యువ దర్శకుడు కర్రీ బార్కర్ రూపొందించిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్…ఒక సాధారణ బొమ్మతో ముడిపడిన భయానక పరిణామాల నేపథ్యంలో సాగుతుంది. మైఖేల్ జాన్స్టన్, ఇండే నవరెట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అద్భుతమైన మౌత్ టాక్ సాధించింది.
సాధారణంగా హారర్ సినిమాలు మొదటి వారం తర్వాత బాక్సాఫీస్ వద్ద నెమ్మదిస్తాయి,.కానీ ఈ సినిమా రెండో వారంలో ఏకంగా 30 శాతం వసూళ్లను పెంచుకోవడం విశేషం. 2009లో వచ్చిన ‘పారానార్మల్ యాక్టివిటీ’ తర్వాత ఇంత తక్కువ పెట్టుబడితో వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచి పెట్టిన బడ్జెట్‌కు వంద రెట్లకు పైగా లాభాలను తెచ్చిపెడుతూ హాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!

