నిరుద్యోగులకు గుడ్ న్యూస్

2
- Advertisement -

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల అర్హత ప్రమాణాలలో భారీ మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ ఎ, బి, సి మరియు డి కేటగిరీల ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని (Upper Age Limit) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం, గరిష్ట వయోపరిమితిని 41 నుండి 45 ఏళ్ల వరకు పెంచారు. ఈ కొత్త నిబంధనలు మే 11 నుంచే అమలులోకి వచ్చాయి.

పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ‘పశ్చిమ బెంగాల్ సర్వీసెస్ (వయోపరిమితి పెంపు) నిబంధనలు, 1981’ కి సవరణలు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఈ నిర్ణయం పెద్ద ప్రభావం చూపనుంది.

గ్రూప్-ఎ (Group A) గరిష్ట వయోపరిమితిని 41 ఏళ్లకు పెంచారు. అయితే, ఇప్పటికే ఏదైనా నిర్దిష్ట పోస్టుకు ఇంతకంటే ఎక్కువ వయోపరిమితి ఉంటే, పాత నిబంధనలే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

గ్రూప్-బి (Group B) గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు సవరించారు. గ్రూప్-సి & గ్రూప్-డి (Group C & D) ఈ రెండు కేటగిరీల ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్లకు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థలు, ప్రభుత్వ కంపెనీలు మరియు స్థానిక సంస్థల నియామక నియంత్రణ చట్టం-1999 కింద జరిగే ఎంపికలకు కూడా గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లుగా ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

బెంగాలీ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా మళ్లీ అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం బెంగాలీ సంస్కృతిని అణచివేసిందని, ఆ పాలన నుండి బెంగాల్ ప్రజలు ఇప్పుడు విముక్తి పొందారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -