దుర్గాపూజ..నిబంధనల్లో భారీ మార్పులు

1
- Advertisement -

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాబోయే దుర్గాపూజ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సంప్రదాయాలు, ధార్మిక విశ్వాసాల పరిరక్షణ మరియు శాంతిభద్రతల నిర్వహణే లక్ష్యంగా ఈ కొత్త నియమాలను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.

దుర్గాపూజ ఉత్సవాల్లో అత్యంత పవిత్రమైన మహాఅష్టమి రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులు, బార్‌లను మూసివేయాలని ఆదేశించారు. ఆ రోజున ఎలాంటి మద్యం విక్రయాలకు అనుమతి ఉండదు . పూజ వేడుకల సమయంలో మరియు విగ్రహ నిమజ్జన ఊరేగింపులలో డీజే సంగీతం ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించారు.

గత తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వ హయాంలో కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో ఏటా నిర్వహించే గ్రాండ్ పూజా కార్నివాల్‌ను ఈసారి రద్దు చేశారు. దానికి బదులుగా ఈడెన్ గార్డెన్స్‌లో డ్రోన్ షోలు, బాణసంచా కాల్వలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

పండగల వేళ రాష్ట్రంలోని అన్ని పూజా పండళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. జాతీయ రహదారులను లేదా కోల్‌కతాలోని 13 ప్రధాన రహదారులను మూసివేసి పండళ్లు నిర్మించడంపై నిషేధం విధించారు. దేవీపక్షం (మహాలయ) ప్రారంభానికి ముందే పూజా పండళ్లను ప్రారంభించడానికి అనుమతించరు.బెంగాలీ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేడుకలు నిర్వహించడమే ఈ కొత్త విధానాల ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read:BB10 హౌస్‌లోకి బాలు-మీనా!

- Advertisement -