ఆసీస్‌తో సిరీస్‌..అండర్-19 టీం

2
- Advertisement -

ఆస్ట్రేలియా సిరీస్ కోసం భారత అండర్-19 జట్టులోకి ఆర్యన్ సవ్సానీ, తన్మయ్ బలోడా ఎంపిక ఆస్ట్రేలియాతో జరగబోయే అండర్-19 హోమ్ సిరీస్ కోసం భారత జట్లలో సౌరాష్ట్రకు చెందిన ఆర్యన్ సవ్సానీ, హర్యానాకు చెందిన తన్మయ్ బలోడాలకు చోటు దక్కింది.

వయస్సు ధృవీకరణలో తేడాలు బయటపడటంతో జట్టు నుంచి తొలగించబడిన రోహిత్ యాదవ్ స్థానంలో వీరిద్దరినీ బిసిసిఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వన్డే జట్టులో రోహిత్ యాదవ్ స్థానంలో ఆర్యన్ సవ్సానీకి చోటు కల్పించగా, మల్టీ-డే (రెడ్ బాల్) జట్టులోకి తన్మయ్ బలోడాను తీసుకున్నారు.

ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత పర్యటనలో భాగంగ మూడు వన్డేలు మరియు రెండు మల్టీ-డే మ్యాచ్‌లు రాజ్‌కోట్, అహ్మదాబాద్ లలో జరగనున్నాయి. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) పత్రాల పరిశీలన సమయంలో రోహిత్ యాదవ్ వయస్సులో దాదాపు 27 నెలల తేడా ఉన్నట్లు తేలింది. దీంతో అతడిపై రెండేళ్లపాటు నిషేధం విధించారు.

భారత్ అండర్-19 వన్డే జట్టుకు రాయ్‌చందానీ నాయకత్వం వహించనుండగా వైస్ కెప్టెన్‌గా యశ్‌బర్ధన్ చౌహాన్ వ్యవహరిస్తారు. మల్టీ-డే మ్యాచ్‌లకు యశ్‌బర్ధన్ చౌహాన్ కెప్టెన్‌గా, లక్ష్య రాయ్‌చందానీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.

Also Read:BB10 హౌస్‌లోకి బాలు-మీనా!

- Advertisement -