భారీ స్కోరు దిశగా భారత్..

52
- Advertisement -

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. తొలుత టాస్ గెలిచిన విండీస్‌…భారత్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.పేస్‌కు సహకరిస్తున్న పిచ్‌పై తొలి రోజు టీ సమయానికి రోహిత్‌ సేన తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.

భారత ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చారు. యశస్వి జైస్వాల్‌ 74 బంతుల్లో 57; 9 ఫోర్లు, ఒక సిక్సర్‌ తో రాణించగా రోహిత్‌ శర్మ 143 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్సర్లుతో రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 139 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించారు.

Also Read:TTD:’పే లింక్’ ఎస్ఎంఎస్

ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌ (10), అజింక్యా రహానే (8) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయారు. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (87),జడేజా 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. విండీస్‌ బౌలర్లలో రోచ్‌, హోల్డర్‌, వారికెన్‌, గాబ్రియెల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

Also Read:విశ్వక్ సేన్‌కు జోడిగా మీనాక్షి చౌదరి

- Advertisement -