వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. భారత్ విధించిన 182 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 36.4 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 182 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. స్వల్ప లక్ష్యం కావడంతో విండీస్ ఆటగాళ్లు ఆడుతు పాడుతు లక్ష్యాన్ని చేధించారు. షై హోప్ (63), కార్టీ (48), కైల్ మేయర్స్ (36) పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం చేసింది వెస్టిండీస్.
అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ పేలవ ఆటతీరుతో విఫలమైంది. ఓపెనర్లు మంచి శుభారంభాన్నే అందించిన టాప్ ఆర్డర్ మాత్రం పూర్తిగా విఫలమైంది.దీంతో 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, ఒక సిక్సర్)తో రాణించగా శుభ్‌మన్ గిల్ (34), సంజూ శాంసన్ (9), అక్షర్ (1), పాండ్యా (7), సూర్యకుమార్ (24), జడేజా (10), శార్దూల్ (16) పరుగులు చేశారు. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే మంగళవారం (ఆగస్టు 1)న జరుగనుంది.
Also Read:బండి సంజయ్ తెలంగాణకు దూరం అవుతారా?