రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇవే..

243
ts
- Advertisement -

వ్యవసాయం- రైతు సంక్షేమం :
-2019 వానాకాలం నుంచి రైతుబంధు పంట సాయం ఎకరాకు రూ. 8 వేల నుంచి 10 వేలకు పెంపు ( 56 లక్షల మంది రైతులకు లబ్ధి- ఏటా 12 వేల కోట్ల ఖర్చు).
-రైతు బీమా రూ.2271 నుంచి రూ.3,556 వరకు ప్రీమియం పెరిగినా.. పథకం కొనసాగింపు.
(దాదాపు 32.73 లక్షల మంది రైతులకు ఏటా రూ.1164 కోట్లు ఖర్చు.).
31,654 వేల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పైగా రూ.1582 కోట్ల రైతుబీమా సొమ్ము అందింది.
-రెండో దఫా లక్ష లోపు రుణమాఫీ : తొలివిడతగా రూ.25 వేల లోపు బాకీ ఉన్న 5.88 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారు. రూ.1210 కోట్లు అందజేత.
-మొత్తం రుణాలు రూ. 25,936 కోట్లు, 40.66 లక్షల మంది రైతులకు లబ్ది.
-కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్ (21 జూన్ 2019).

తెలంగాణ భూముల సస్యశ్యామలం, సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు:
-ప్రాజెక్టుల ద్వారా 80 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. ప్రాజెక్టుల ద్వారా 3,688 చెరువులను నింపారు. చెరువుల కింద 15 లక్షల ఎకరాలు సాగవుతున్నది.
-3 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. (గతంలో 12 మీటర్ల లోతు – 9 మీటర్ల లోతులో నీరు).
-కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు మొదటిసారిగా అందిన గోదావరి జలాలు.
-25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ (2018 జనవరి 1 నుంచి).
-సాగునీరు పుష్కలం – 24 గంటల ఉచిత కరెంటుతో 1 కోటి 25 లక్షల ఎకరాల్లో సాగు.
-కరోనా టైంలో పాడి రైతుల రుణాల పరిమితి 1.6 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంపు.
-3 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు.
-గిట్టుబాటుధర కల్పించడానికి రైతుల పంటల కొనుగోళ్లు.
-6408 కేంద్రాలద్వారా రైతుల కల్లాల వద్దే ధాన్యం కొనుగోళ్లు.
-2019-20లో 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది.
-ఆరేండ్లలో 367శాతం కొనుగోళ్లు పెరిగాయి. (దేశంలో 63శాతం తెలంగాణ వాటా, మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 37శాతం వాటా) (రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ).
-రైతులకు వడ్డీలేని రుణాల బకాయిలు రూ.256 కోట్లు చెల్లింపు (5 జులై 2019).
-సాదా బైనామాల ద్వారా భూముల రిజిస్ట్రేషన్ (మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కూడా అవకాశం -31 అక్టోబర్ 2020).
-నియంత్రిత పద్ధతిలో ప్రత్యామ్నాయ పంటల సాగు అమలు.
-ధరణి వెబ్ సైట్ ప్రారంభం : మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి (29 అక్టోబర్ 2020).
-తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు.
-రాష్ట్రంలోని 2,604 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం.
-కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్.
-2020 అక్టోబర్ 31న జనగామ జిల్లా కొడకండ్లలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్మించిన రైతు వేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.

సంక్షేమం- పెన్షన్లు:
-39 లక్షల 35 వేల మందికి ఆసరా పెన్షన్ల రెట్టింపు- ( మే 2019 నుంచి).
-కొత్తగా 8.5 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ( మరో 6.5 లక్షల మందికి అవకాశం).
-ఆసరా పెన్షన్ల కోసం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది.
-బీడీ కార్మికులకు పీఎఫ్ కటాఫ్ డేట్ తొలగింపు.
-ఒక ఇంట్లో ఇంకెవరైనా పెన్షన్ పొందుతున్నా, మిగతా అర్హులకూ పెన్షన్.
-పెరిగిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు.
-గణనీయంగా తగ్గిపోయిన బాల్య వివాహాలు.
-దివ్యాంగులకు సంక్షేమ పథకాలు, కాంట్రాక్టులు, డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంలో 5శాతం అదనపు రిజర్వేషన్.
-దివ్యాంగ వధువులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సాయం రూ.1.25 లక్షలకు పెంపు.
-గీత కార్మికుల కోసం తెలంగాణలో నీరా పాలసీ.

పౌర సరఫరాల శాఖ :
-కరోనా సమయంలో ప్రతి వ్యక్తికీ నెలకు 12 కిలోల చొప్పున 4 నెలల పాటు ఉచితంగా రేషన్ బియ్యం, మూడు నెలలపాలు 2 కిలోల చొప్పున కందిపప్పు, 10 కిలోల చొప్పున 4 నెలలపాటు ఉచితంగా రేషన్ బియ్యం అందజేత.
-2020 ఏప్రిల్, మే నెలల్లో ఒక్కో కుటుంబానికి రూ.1500 ఆర్థిక సాయం
-రేషన్ పోర్టబులిటీ = రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం
-తెలంగాణ స్ఫూర్తితో స్ఫూర్తితో కేంద్రం వన్ నేషన్ – వన్ రేషన్ కార్డు ప్రవేశపెట్టింది.

పంచాయతీరాజ్ శాఖ :
-కొత్త పంచాయతీరాజ్ చట్టం – 2018 పక్కాగా అమలు.
-గ్రామ పంచాయతీలు (పాతవి 8,690+కొత్తవి 4,079 = 12,769 మొత్తం).
-కొత్తగా 9,355 మంది పంచాయతీ కార్యదర్శుల నియామకం.
-పల్లె ప్రగతి కార్యక్రమం : 6 సెప్టెంబర్ 2019 నుంచి నెల పాటు సాగింది.
-పారిశుద్యం, విద్యుత్ పనులు, పురాతన భవనాల కూల్చివేత, శ్మశాన వాటికలు (వైకుంఠధామాలు), డంపింగ్ యార్డులు, ప్రతి గ్రామానికో నర్సరీ, హరితహారం ప్రణాళికలు మొదలైన పనులు చేపట్టారు.
-2 కొత్త జిల్లాలు (ములుగు, నారాయణపేట) ఏర్పాటు (10 పాతవి+23 కొత్తవి=33).
-కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు (44 పాతవి+30 కొత్తవి = 73 మొత్తం).
-గ్రామ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రూ.5 వేల లోపు నుంచి రూ.8500 వరకు పెంపు.
-పంచాయతీ సిబ్బందికి ఎస్.కే. డే పేరిట రూ.2 లక్షల జీవిత బీమా (10 అక్టోబర్ 2019).
-పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ ఏర్పాటు 19 సెప్టెంబర్ 2019.

స్థానిక సంస్థలు- మున్సిపాలిటీలు :
-కొత్త మున్సిపల్ చట్టం అమలు (19 జూలై 2019).
-కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు (పాతవి 6 + కొత్తవి 7 = 13 మొత్తం).
-బడంగ్ పేట, బండ్లగూడ జాగీర్, మీర్ పేట, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట.
-కొత్తగా 76 మున్సిపాలిటీల ఏర్పాటు (52 పాతవి + 76 కొత్తవి = 128 మొత్తం).
-పట్టణ ప్రగతి కార్యక్రమం (24 ఫిబ్రవరి 2020 నుంచి 10 రోజుల పాటు) స్వచ్ఛ కార్యక్రమాలు, గ్రీన్ ప్లాన్, నర్సరీలు, విద్యుత్ పనులు, శ్మశాన వాటికల నిర్మాణం, సమీకృత మార్కెట్లకు, డంపింగు యార్డులు, మురుగునీటి శుద్ధి కార్యక్రమాలకు స్థలాల గుర్తింపు మొదలైన పనులు చేపట్టారు.

మిషన్ భగీరథ:
-మిషన్ భగీరథతో రాష్ట్రంలోని 95శాతానికి పైగా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీరు.

గురుకులాలు :
-119 నియోజకవర్గాల్లో కొత్తగా బీసీ గురుకులాలు ప్రారంభం 17 జూన్ 2019 (పాతవి 161 గురుకులాలుండగా, కొత్తవి 119తో 280 వరకు పెరిగాయి),( గురుకులాలు : తెలంగాణ ఏర్పాటుకు ముందు 298 ఉండగా, కొత్తగా 618 పాఠశాలలు, 53 డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. దీంతో వీటి సంఖ్య 969 వరకు చేరింది. వీటిలో 3 లక్షల మంది చదువుకుంటున్నారు.ఒక్కో విద్యార్థిపై 1.20 లక్షలు ఖర్చు).

-సిద్దిపేట జిల్లా ములుగులో ఫారెస్టు కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హార్టికల్చర్ యూనివర్సిటీ భవనాల ప్రారంభం 11 డిసెంబర్ 2019.
-గజ్వేల్‌లో ఎడ్యుకేషనల్ హబ్.

విద్యుత్ :
-పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో చేపట్టిన విద్యుత్ పనులు.
-అన్ని వర్గాలకూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా.
-మణుగూరులో బీటీపీఎస్ మొదటి యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం (25 మార్చి 2019).
-విద్యుత్ శాఖలో ఆర్టిజన్ల సర్వీసుల క్రమబద్దీకరణ, ఇతర ఉద్యోగుల లాగే ఇంక్రిమెంట్లు, పీఆర్సీ ఇతర సౌకర్యాలు.

విశ్వనగరంగా హైదరాబాద్ :
-హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో ప్రారంభం (29 నవంబర్ 2019)
-9 ఫ్లై ఓవర్లు, 4 అండర్ పాస్ లు, 3 ఆర్వోబీలు ప్రారంభం.
-హైదరాబాద్ ఎల్బీనగర్, కామినేని ఫ్లై ఓవర్లు, మైండ్ స్పేస్, బయోడైవర్సిటీ, ఎల్బీనగర్, చింతలకుంట అండర్ పాస్ లు మొదలైనవి ప్రారంభం
-దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం (25 సెప్టెంబర్ 2020)
-కరోనా సమయంలో 2 వేల కోట్ల విలువైన 15 ఫ్లై ఓవర్లు, 300 కి.మీ. రోడ్ల పనులు, 29 లింకురోడ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి.
-హైదరాబాద్ లో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం
-రాష్ట్రవ్యాప్తంగా 179 అన్నపూర్ణ భోజనం సెంటర్లు. రోజుకు 52 వేల మందికి భోజనం కరోనా సమయంలో వలస కూలీలకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేనిఫోస్టోలో వరాలు :
-2020 నుంచి ప్రతి ఇంటికీ, అపార్టు మెంట్లకు కూడా 20 వేల లీటర్ల దాకా ఉచితంగా మంచినీరు.
-సెలూన్లకు, లాండ్రీలకు, దోభీఘాట్‌లకు ఉచిత విద్యుత్‌.
-13 వేల కోట్లతో హైదరాబాద్ మహా నగరానికి సీవరేజి మాస్టర్ ప్లాన్.
-గోదావరితో మూసీ అనుసంధానం.
-కరోనా కాలానికి మోటార్ వాహన పన్ను రద్దు.
-పరిశ్రమలు, వ్యాపార సంస్థల విద్యుత్ కనెక్షన్లకు కనీస విద్యుత్ డిమాండ్ చార్జీల మినహాయింపు.
-ఎల్.ఆర్.ఎస్. మరోసారి ఎల్.ఆర్.ఎస్ ను ప్రకటన, జీవో 131 విడుదల (1 సెప్టెంబర్ 2020).

ఆర్టీసీ ఉద్యోగులకు వరాలు :
-ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏండ్లకు పెంపు.
-సమ్మె కాలంలో బకాయి పడ్డ వేతనాలు చెల్లింపు.

కొత్త సచివాలయం :
-కొత్త సచివాలయానికి శంకుస్థాపన (27 జూన్ 2019).
-కొత్తగా 26 జిల్లా కలెక్టరేట్ల భవనాల నిర్మాణం (దాదాపుగా పూర్తి).
-నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు 104 క్యాంపు కార్యాలయాలు.
-న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభం ( 17 జూన్ 2019 ప్రారంభం).

ఆరోగ్యం :
-బీబీనగర్ లో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ప్రారంభం (4 డిసెంబర్ 2019).
-కోటిన్నర మందికి కంటివెలుగు పరీక్షలు (15 ఆగస్టు 2018 నుంచి).
-ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు 6 లక్షల ప్రసవాలు. ఈ బాలింతలంతా కేసీఆర్ కిట్లు అందుకున్నారు.
-ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా వైద్య సౌకర్యాలు.
-సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి, నార్మల్ డెలివరీలు.
-గతంలో 30 శాతం డెలివరీలు – ఇపుడు రెట్టింపయ్యాయి.
-అందుబాటులోకి ఐసీయూ సేవలు ( మెడికల్ కాలేజీల్లో కూడా…).
-46 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, సింగిల్ యూజ్డ్.
-ప్రభుత్వ దవాఖానాల్లోనే ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు, వీటికోసం ప్రత్యేక బడ్జెట్.
-నగదు రహితంగా ఎంప్లాయీస్, జర్నలిస్టుల హెల్త్ స్కీం (ఈజీహెచ్ఎస్) అమలు.
-ఆరోగ్యశ్రీ పథకంలో 35శాతం వరకు పెరిగిన సేవలు.
-వ్యాధుల పట్ల అవగాహణతో మరణాలశాతం తగ్గుముఖం.
-మృతదేహాల తరలింపునకు 50 పరమపద వాహనాల ఏర్పాటు.

పరిశ్రమలు:
-ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ప్రారంభించిన అమెజాన్ (10 జనవరి 2020) 10 ఎకరాల్లో 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణం- 9 వేల మంది ఉద్యోగులు.
-20,760 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ నిర్ణయించింది. 6 నవంబర్ 2020.
-బయో ఫార్మా రంగానికి ప్రోత్సాహం- రూ.60 కోట్లతో బీ-హబ్.
-సిర్పూర్ పేపర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ- 7 ఫిబ్రవరి 2019న ప్రారంభం.
-దేశంలోనే అతిపెద్ద ముచ్చర్ల ఫార్మా సిటీ 19,333 ఎకరాలు.
-రూ.27,800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం- 4.25 లక్షల మందికి ఉపాధి.
-ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీ ప్రకటన 30 అక్టోబర్ 2020.
-ఎలక్ట్రానిక్ వాహనాలు తయారు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు.
-వినియోగదారుల ప్రోత్సాహం కోసం రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్ రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
-మొత్తం 14 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చారు. రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో మొత్తం 15 లక్షల మందికి ఉపాధి లభించింది.
-ఈవోడీబీలో వరుసగా మూడుసార్లు టాప్-3లో చోటు దక్కించుకుంది.

ఐటీ :
-ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ
-జాతీయ సగటును మించిన రాష్ట్ర ఐటీ ఎగుమతులు. 2018-19, 2019-20 రెండేళ్లలో 2.38 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి.
-కరోనా సమయంలో జాతీయ స్థాయిలో ఐటీ వృద్ధిరేటు 8.09 శాతం ఉండగా, తెలంగాణలో 17 శాతం వృద్ధిరేటు నమోదైంది.
-హైదరాబాద్ నలువైపులా ఐటీ విస్తరణ- లుక్ ఈస్ట్ నినాదం..హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఐబీఎం, ఒరాకిల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్ర లాంటి దిగ్గజ కంపెనీలు.
-షీ టీముల ద్వారా కోటిన్నర మంది మహిళలకు అవగాహన కార్యక్రమాలు.
-హరితహారం- గ్రీన్ బడ్జెట్ పెంపు.

(పెండింగ్)…….
-పెన్షన్ల వయో పరిమితి 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించే యోచన.
-నిరుద్యోగ యువతకు నెలవారీ నిరుద్యోగ భృతి అందించే యోచన.
-ప్రతి జిల్లాకు ఒక ఫుడ్ పార్కు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు (19 జూలై 2020).
-పురోగతిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం.

- Advertisement -