వెబ్‌ సిరీస్‌కు నాని గ్రీన్ సిగ్నల్..?

229
nani
- Advertisement -

నాచురల్‌ స్టార్‌ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని ‘టక్ జగదీశ్’ సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో పూర్తికానుంది. దీని తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చేస్తాడు. ఆ తర్వాత ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేయాల్సివుంది. సినిమాలతో బిజీగా ఉన్న నాని ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లో కూడా నటించబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ ఫాంకు ఎంత ప్రాధాన్యం ఉందో అందరికీ తెలిసిపోయింది. పలువురు సినీ తారాలు ఓటీటీ వైపు మెగ్గుచూపుతున్నారు. ఇటు సినిమాలు చేస్తూనే.. అటు ఓటీటీ సంస్థల కోసం వెబ్ సీరీస్ వంటివి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు వీటితో బిజీగా వున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నిర్మించే ఓ వెబ్ సీరీస్‌లో నాని ప్రధాన పాత్ర పోషించనున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి దాని తర్వాత నెట్ ఫ్లిక్స్ సీరీస్ షూటింగ్ చేస్తాడట నాని.

- Advertisement -