చిరు 151: కేపీసీ సంబరాలు..

245
Welcome Director Surrender Reddy to the KPC
- Advertisement -

గతేడాది మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీతో బాక్సాఫీస్ షేక్ చేసిన ఖైది 150.. సినిమా 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది.. ఇక
చిరు 150వ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలని చాలామంది పోటీపడ్డారు. కానీ ఆ అవకాశం రామ్‌చరణ్‌కే దక్కింది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించి ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాన్ని రూపొందించారు చరణ్. చరణ్‌కి నిర్మాతగా తొలి అడుగులోనే విజయం అందింది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఏర్పాటై ఆదివారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తొలి వార్షికోత్సవ సంబరాలు ఆదివారం హైదరాబాద్‌లో చిరు ఇంట ఘనంగా జరిగాయి. కేక్‌ కట్‌ చేసి తన ఆనందాన్ని పంచుకొన్నారు చిరు. చిరంజీవి 151వ చిత్రం కూడా కొణిదెల సంస్థలోనే ఉండబోతోంది. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. ‘‘మా సంస్థలో పనిచేయబోతున్న సురేందర్‌రెడ్డికి స్వాగతం’’ అంటూ ఆహ్వానించారు చరణ్‌.

chirajeevi KPC

టాలీవుడ్ టాప్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ మెగాస్టార్ ఇమేజ్ కు తగిన విధంగా సినిమాటిక్ గా ఉయ్యాలవాడ కథను తీర్చి దిద్దారు. ఒరిజినల్ గా స్టోరీ ఎలా ఉన్నా క్షకులకు వినోదం పంచడానికి కొన్ని మార్పులు చేర్పులు సహజమే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ విషయంలోనూ అలానే చేసారట.

ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు పాత్రలకు తగిన విధంగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుందని టాక్. ఏప్రిల్‌ రెండో వారంలో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలన్నాయని తెలుస్తోంది. సినిమాలో గెరిల్లా పోరాటాలతో పాటు అభిమానులను అలరించేలా ఉయ్యాలవాడ నరిసింహారెడ్డి లవ్ స్టోరీ కూడా ఉంటుందని టాక్. ఉయ్యాలవాడ చరిత్ర చెబుతూనే అభిమానులకు కావాల్సిన వినోదం పంచేలా సినిమాను ప్లాన్ చేస్తున్నారట.

chiranjeevi

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి షూటింగ్ జూన్ లో మొదలవుతుందని చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. తన కెరీర్లో ఎప్పటికైనా భగత్ సింగ్ క్యారెక్టర్ చేయాలనుకున్నారు చిరంజీవి. త్వరలో తాను చేయబోయే ‘ఉయ్యాల వాడ నరసింహారెడ్డి’ సినిమాతో ఆ వెలితి తీరనుందనున్నారు చిరు. అలాంటి దేశ భక్తుడి పాత్రలో చేయబోతున్నందుకు గర్వంగా ఉంది అని చిరంజీవి తెలిపారు.

- Advertisement -