బిజీలైఫ్… పోటీ ప్రపంచం.. ప్రతి నిమిషం పరుగులు తీయాల్సిందే! ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం, ఆహారం గురించి పట్టించుకోవడమే మానేశారు చాలామంది. కంటికి సరిపడా నిద్ర లేక రకరకాల ఆరోగ్య సమస్యల్ని తెచ్చుకుంటున్నారు. ఇక వీకెండ్ వచ్చిందంటే.. ఫ్రైడే నైట్ ఎక్కువ సమయం మేలుకోవడం. దీనివల్ల ఉదయం లేట్ గా లేయచ్చు అనే ప్లాన్ చేసుకుంటారు ఉద్యోగస్తులు. అయితే ఇలాంటి అలవాటు వల్ల మీ హెల్త్ కి చాలా హానికరమని స్వీడన్ లోని కరోలిన్స్ కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు వెల్లడించారు. నిజానికి విశ్రాంతి లభించకపోగా అలసట ఏర్పడుతుందని అంటున్నారు పరిశోధకులు.
వారాంతాల్లో ఎక్కువ సమయం పాటు నిద్రపోయే వారిపై ఓ పరిశోధన నిర్వహించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు. వారాంతాల్లో అధిక సమయం పాటు నిద్రపోవడం వల్ల శరీర క్రమగతి తప్పుతుందట. దీంతో విశ్రాంతి లేకపోగా అదనపు ఇబ్బంది ఏర్పడుతుందన్నది పరిశోధన సారాంశం.
సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండని అంటున్నారు. ప్రతి రోజూ నిద్ర విషయంలో ఏ షెడ్యూల్ అయితే పాటిస్తున్నామో దాన్నే వారాంతాల్లోనూ అనుసరించడమే మంచిదని.. వీలైతే వర్కింగ్ డే కంటే.. మరో గంటలో నిద్రపోయేలా షెడ్యూల్ చేసుకోవడం మంచిదని పరిశోధకుల సూచన.
Also Read:పచ్చి అరటికాయతో ప్రయోజనాలు