కబాలి, కాలా, సినిమాలతో క్రేజ్ సంపాధించుకున్న డైరెక్టర్ పా.రంజిత్ కన్ను ఇప్పుడు సిల్క్‌స్మితపై పడింది. తెలుగు, తమిళ భాషల్లో ప్రధాన పాత్రలు, ప్రత్యేక గీతాల ద్వారా మంచి పేరు తెచ్చుకుంది సిల్క్‌స్మిత. కొన్ని కథలైతే ఆమె పాత్ర చుట్టూనే తిరిగాయంటే అప్పట్లో ఆమెకుండే క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు అప్పట్లో కుర్రాళ్ళంతా మత్తుకళ్ళసుందరిగా సిల్క్ స్మితను పిలుచునేవాళ్ళు. అంతటి క్రేజ్ ఉన్న సిల్క్ స్మిత జీవిత చరిత్రగా ‘ది డర్టీ పిక్చర్ ‘ వచ్చింది.
ఆ సినిమా సూపర్ హిట్ అయినా.. మరిన్ని కోణాల్లో సిల్క్‌స్మిత జీవితాన్ని ఆవిష్కరించవలసిఉందనే ఆలోచనతో సిల్క్ స్మిత జీవితాన్ని పూర్తిస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పా రంజిత్ రెడీ అవుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే వెబ్ సిరీస్ ని ప్లాన్‌చేస్తున్నాడు పా.రంజిత్. ఇప్పటికే సిల్క్‌స్మిత బాల్యం నుంచి చనిపోయేవరకు గల అంశాలకి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పా.రంజిత్ ఉన్నాడని టాక్. కాగా.. ఈ వెబ్ సిరీస్ కి ఆయనే దర్శక నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది.