1991, మే 21వ తేదీన శ్రీపెరంబదూర్‌లో జరిగిన సూసైడ్ అటాక్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృతిచెందారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిల్ ఈళం ఆ దాడికి పాల్పడగా అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ హత్య సంచలనం సృష్టించింది. రాజీవ్ గాంధీ హత్యోదంతం, తదనంతర పరిణామాలపై రచయిత అనిరుధ్య మిత్రా ‘నైంటీ డేస్: ది ట్రూ స్టోరీ ఆఫ్ హంట్ ఫర్ రాజీవ్‌గాంధీస్ అసాసిన్’ అనే నవల రాశారు. ఈ బుక్ కూడా బాగా పాపులర్ అయింది.
తాజాగా ఈ పుసక్తం ఆధారంగా వెబ్ సిరీస్ రాబోతోంది. ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ వెబ్ సిరీస్ ఫేం నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సిరీస్ ని నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సమీర్ నాయర్ మాట్లాడుతూ…సంచలనం సృష్టించిన రాజీవ్ గాంధీ హత్య, దర్యాప్తు, హంతకులను పట్టుకోవడం.. ఇవన్నీ మనం మనం పత్రికల ద్వారా తెలుసుకున్నాం. ఈ సంఘటలన్నింటినీ ఇప్పుడు దృశ్య రూపంలో తెరకెక్కించబోతున్నాం అని తెలిపారు.