వింత జీవితో పోరాటమే ఆర్య ‘కెప్టెన్’!

101
aarya
- Advertisement -

శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వంలో ఆర్య హీరోగా తెరకెక్కిన చిత్రం కెప్టెన్‌. ఈనెల 8న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే విడుదలైన ప్ర‌చార చిత్రాలు, ట్రైల‌ర్ సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో ఆర్య ఆర్మీ అధికారిగా కనిపించనుండగా ఆర్య‌కు జోడీగా ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ హీరోయిన్‌గా న‌టించగా థింక్ స్టూడీయోస్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి విడుద‌ల చేస్తున్నారు. సెప్టెంబర్ 8న ఈ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడిన ఆర్య…ఈ డైరెక్టర్ తో గతంలోనే సినిమా చేశాను. ఇతనికి గ్రాఫిక్స్ మీద మంచి పట్టు ఉంది. అందుకే కెప్టెన్ సినిమా ఒప్పుకున్నాను. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ చేశాం అని తెలిపారు. ఓ వింత జీవితో పోరాటం చేయడమే కెప్టెన్ సినిమా కథ.

ఈ సినిమాలో ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌ ఉంది కాబట్టి ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా డీల్‌ చేశాం. మాకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే అది ఆర్మీ వాళ్ళని తక్కువ చేసినట్లుగా ఉంటుంది. అందుకే అలంటి తప్పులు జరగకుండా సెట్ లో ఓ రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ను కూడా పెట్టుకున్నాం అని చెప్పారు.

- Advertisement -