మంత్రి కేటీఆర్ చేనేత పరిశ్రమ అభివృద్ధి కి ముందు నుంచి ఎంతో ప్రోత్సహాం అందిస్తున్నారన్నారని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను దరిస్తూ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారన్నారు. వారి సూచనల మేరకు తాను కూడా ఇకపై ప్రతీ సోమవారం చేనేత వస్త్రాలే ధరిస్తానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు బతుకమ్మ పండుగ సందర్భంగా ఎంతో విలువైన చీరలను చేనేత కార్మికుల ద్వారా తయారు చేయించి చేనేత వృత్తికి అండగా నిలిచారన్నారు.
చేనేత కార్మికులకు అండగా నిలవాలనే సామాజిక బాధ్యతగా భావించి ప్రతి సోమవారం రోజు ఉద్యోగులు అందరూ విధిగా చేనేత దుస్తులు ధరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారులకు సూచించారు. అందులో భాగంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి సారధ్యంలో THE TELANGANA STATE HANDLOOM WEAVERS CO-OPERATIVE SOCIETY LTD (TSCO) ఆధ్వర్యంలో నాంపల్లి లో ఉన్న చేనేత దుస్తుల కేంద్రంలో చేనేత వస్త్రాలను TGO కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత, జనరల్ సెక్రటరీ A. సత్యనారాయణ, మాజీ కోశాధికారి శ్రీ విష్ణువర్ధన్ రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ M B కృష్ణ యాదవ్, హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షులు శ్రీ గండూరి వెంకట్, ఉపాధ్యక్షులు రవీందర్ రావు, లక్ష్మణ్ గౌడ్, B. వెంకటయ్య, వీర ప్రతాప్ మరియు TGO నాయకులతో కలసి చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు చేనేత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారన్నారు. వారికి మద్దతుగా నిలిచి చేనేత ను ప్రోత్సహించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.