మన రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నల్లబంగారంతో పాటుగా తెల్లబంగారం ఉందన్నారు. దేశంలో అతిపెద్ద టెక్స్‌టైల్స్ పార్కు కాకతీయ పార్కని అన్నారు. వరంగల్‌కు మళ్లీ పూర్వవైభవం కోసం కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఎంతోమంది ఉన్నారని అన్నారు. దక్షిణ కొరియా యంగ్‌వాన్ కంపెనీ వరంగల్‌లోని శాయంపేటలో ఉన్న కాకతీయ పార్కులో శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీలల్లో 99శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతుందన్నారు. దేశంలో వ్యవసాయం టెక్స్‌టైల్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇప్పటికే గణేశా కంపెనీ రూ.600కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు. ఈ కంపెనీ ద్వారా వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు వచ్చాయన్నారు.
వరంగల్ జిల్లాలో వచ్చే మూడు కంపెనీల వల్ల 33 వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ పరకాలగా మారుతుందని చెప్పారు. వరంగల్‌లో తయారయ్యే దుస్తులు విదేశాలకు ఎగుమతి అవుతాయన్నారు. పీఎం మిత్ర పథకానికి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు మోడల్‌గా మారిందని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు కేంద్రానికి మార్గదర్శకం అయ్యాయని తెలిపారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు దేశానికే దిక్సూచిగా మారిందన్నారు.
Also Read: KTR:వరంగల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
దేశంలోని మున్సిపల్, పంచాయతీ అవార్డుల్లో 30 శాతం మనవేనని చెప్పారు. 3 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 33 శాతం అవార్డులు వస్తున్నాయన్నారు. ఐదేండ్లు మీ కోసం కష్టపడ్డామని, ఇప్పుడు మీరు మాకు అండగా ఉండాలన్నారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నాని వెల్లడించారు. నవంబర్, డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని స్పష్టం చేశారు.
Also Read: CMKCR:దేశద్రోహం కేసులు ఎత్తివేయండి.. డీజీపీకి ఆదేశాలు