CMKCR:దేశద్రోహం కేసులు ఎత్తివేయండి.. డీజీపీకి ఆదేశాలు

48
- Advertisement -

తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి పోలీసు స్టేషన్‌లో గతడేది ఆగస్టు19న నమోదైన దేశద్రోహం కేసు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉపా కేసులు ఎత్తివేయాలని డీజీపీ అంజనీ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో పౌరహక్కుల నేత హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్ హరగోపాల్‌, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్‌, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్‌, ప్రొఫెసర్ పద్మజా షా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్‌, చిక్కుడు ప్రభాకర్‌, ఇంకా 152మందిపై నమోదు చేసిన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10సెక్షన్ల కింద నమోదైన కేసులు ఎత్తివేయనుంది.

Also Read: KTR:వరంగల్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 

- Advertisement -