చిన్న పరిశ్రమలకు జీఎస్టీ విధించబోము : సీఎం విజయన్‌

46
pinarai
- Advertisement -

కేరళ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కుటుంబ శ్రీ అనే స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులు , ఆహార శుద్ది పరిశ్రమలుగా ఏర్పడి నడుస్తుంటాయి. చిన్న చిన్న దుకాణాల్లో 1, 2 కేజీల ప్యాకేట్ల రూపంలో విక్రయించే వస్తువుల పై జీఎస్టీ విధించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎస్‌ బాలగోపాల్‌ అసెంబ్లీ వేదికగా బుధవారం ఈ ప్రకటన చేశారు. ఈ విషయంలో కేంద్రంతో పేచీ వచ్చినా తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. సీఎం విజయన్‌ సైతం నిన్ననే కేంద్రానికి ఓ లేఖ రాశారు. చిన్న తరహా వ్యాపారులు, చిరు వ్యాపారుల పై పన్నులు వేయాలని మేం అనుకోవడం లేదని అసెంబ్లీలో బాలగోపాల్‌ స్పష్టం చేశారు.

నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడంపై ప్రధాని జోక్యం చేసుకొవాలని కోరుతూ సీఎం విజయన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. జీఎస్టీ వల్ల సామాన్యులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ముఖ్యంగా కేరళలో మిల్లర్లు, చిన్న చిన్న దుకాణాలు నడిపేవారు సైతం వస్తువులను ముందుగానే ప్యాకేజీ చేసి విక్రయిస్తుంటారని తన లేఖలో విజయన్‌ పేర్కొన్నారు. ప్యాక్‌ చేసి అమ్మడం అనేది సర్వసాధరణమైన విషయమని తెలిపారు. ప్యాక్‌ చేసి విక్రయించే వస్తువులను తాజాగా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల చిన్న చిన్న దుకాణాల్లో కొనుగోలు చేసే వినియోగదారులపై భారం పడుతుందని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రంతో పేచీ వచ్చినా తాము మాత్రం కేరళలలోని చిన్న తరహా పరిశ్రమలపై జీఎస్టీ విధించబోమని స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -