- Advertisement -
దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 47కి కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించారు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. కరోనాతో యుద్ధం చేస్తున్నామని తెలిపిన ఠాక్రే..ప్రజలు అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావద్దన్నారు.
ముంబైకి చెందిన ఇద్దరు మహిళలకు కోవిడ్ నిర్ధారణ కావడంతో మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 47కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 170 కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ కట్టడి ముందస్తు చర్యల్లో రైల్వే అప్రమత్తంగా ఉందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, స్థానికంగా ఉన్న రైల్వే కమ్యూనిటీ హాల్‌ను సిద్ధం చేయాలన్నారు.
- Advertisement -