పుచ్చకాయ నిల్వ ఉంచితే.. ప్రమాదమా?

17
- Advertisement -

వేసవి వచ్చిందంటే అందరి దృష్టి పుచ్చకాయపై పడుతుంది. రుచిలో తీపి ఒగరు కలగలిసిన ఈ పండు 90 శాతం నీటిని కలిగి ఉంటుంది. అందుకే సమ్మర్ లో ఎండతాపం నుంచి బయట పడేందుకు అందరూ ఈ పండును ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, తో పాటు క్లోరిన్, బీటా కెరోటిన్, మెగ్నీషియం, పొటాషియం.. వంటి పోషకాలు చాలానే ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అవసరమైన రీతిలో శక్తిని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ పండు తినడం వల్ల డీహైడ్రేషన్ బెడట ఉండదు. వడదెబ్బ తగలకుండా ఈ పండు శరీర ఉష్ణోగ్రతను సమతుల్య పరుస్తుంది. ఇంకా పుచ్చకాయ తినడం వల్ల గుండెపోటు, రక్త పోటు వంటి సమస్యలుకూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని క్యాన్సర్ కరకాలను తగ్గించే గుణాలు కూడా పుచ్చక యలో ఉన్నాయని పలు పరిశోదనల్లో వెల్లడింది.

అయితే సమ్మర్ లో మాత్రమే అధికంగా లభించే ఈ పుచ్చకాయను కొనుకొని ఇంట్లో ఫ్రీడ్జ్ లో భద్రపరచుకొని తింటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే పుచ్చకాయ ఆకారంలో పెద్దగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులంతా కలిసి పండు తిన్న ఇంకా మిగిలే ఉంటుంది అందువల్ల మిగిలిన పండును ఫ్రీడ్జ్ లో భద్రపరచుకొని తరువాతి సమయాల్లో తింటూ ఉంటారు. ఇలా పుచ్చకాయను ఫ్రీడ్జ్ లో భద్రపరచడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలా చేయడం వల్ల అందులోని పోషకాలు నశించే అవకాశం ఉందట. ఎందుకంటే 90 శాతం నీరు కలిగిన పుచ్చకాయను ఫ్రీడ్జ్ లో పెడితే అందులోని శీతల ఉష్ణోగ్రత పండుపై ప్రభావం చూపుతుంది. ఇంకా కట్ చేసిన పుచ్చకాయలో వేగంగా బ్యాక్టీరియా ఏర్పడుతుంది. తద్వారా ఆ పండు తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పుచ్చకాయ ను ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా త్వరగా తినేయడం మంచిది.

Also Read:మరో సర్వే.. టాఫ్ ఫైట్ ఖాయం?

- Advertisement -