కాళేశ్వరంకు కొనసాగుతున్న నీటిప్రవాహం

651
kaleshwaram water
- Advertisement -

కరీంనగర్ జిల్లా…కాళేశ్వరం వద్ద గోదావరి,ప్రాణహిత 14000 వేల కుసెక్కుల నీరు ప్రవహిస్తుంది. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం లోని కాళేశ్వరం (మేడిగడ్డ) లక్ష్మి బ్యారేజి వద్ద 85 గేట్స్ మూసీ ఉంచారు.దీని సామర్ధ్యం 16.17 కాగా 4.50 టీ యం సి నీరు నిలువ ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 1 లోని లక్ష్మి (కన్నేపళ్లి) పంపు హౌజ్ లో 3 మోటార్లు నడుస్తున్నాయి, ఒక్కొక్క పంపు ద్వారా 2,200 చొప్పున 6,600 కూసెక్కుల నీటిని సరస్వతి బ్యారేజి లోకి పంపిస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద సరస్వతి పంపు హౌజ్ లో 4 మోటార్స్ ద్వారా ఒక్కొక్క మోటార్ నుండి 3000 వేల కుసేక్కుల చొప్పున 12000 వేల కుసెక్కల నీటిని పార్వతి బ్యారేజి కి పంపిస్తున్నారు.అంతర్గం మండలం గొలివాడ లోని పార్వతి బ్యారేజి లో 7 మోటార్స్ ద్వారా ఒక్కొక్క మోటర్ నుండి 2,700 కుసెక్కుల్ చొప్పున 18,900 కూసెక్కుల్ నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు కు పంపిస్తున్నారు.

మరో వైపు లింక్ 2 లో ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ధర్మారం మండలం నంది మేడారం చేరుకున్న జలాలు *నంది పంపు హౌజ్ ద్వారా నీరు 2 మోటార్స్ ద్వారా ఒక్కొక్క పంపు నుండి 3,150 కుసెక్కులు లు కాగా రెండు పంపుల నుండి 6,300 కుసేక్కుల్ నీటిని నంది రిజర్వాయర్ త్రలించి 17 కిలో మీటర్లు జంట సొరంగంల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మి పూర్ లోని *గాయత్రి పంపు హౌజ్ కు చేరుకుంటున్నాయి.ఇక్కడ 2 మోటార్స్ నడుస్తున్నాయి,ఒక్కొక్క పంపు నుండి 3150 కుసెక్కు లు కాగా రెండు పంపుల ద్వారా 6,300 కుసెక్కులా నీటిని గ్రావిటీ కాలువ ద్వారా వరద కాలువలో కలుస్తు (మిడ్ మనేరు) శ్రీ రాజ రాజేశ్వరీ జలాశయానికి చేరుకుంటున్నాయి.ఈ ప్రాజెక్ట్ నీటి సామర్ధ్యం 25.873 టీ యం సి లు కాగా ప్రస్తుతం 17 టి యం సి ల నీరు చేరుకుంది.ఈ సాయంత్రం వరకు 18 టి యం సి ల నీరు వచ్చే అవకాశం ఉంది. ఈ జలాశయం లోకి నీరు వచ్చి చేరడంతో జలాశయం నీటితో నిండు కుండను తలపిస్తుంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 1, లింక్ 2 నిరంతరంగా నడుస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ అధికారులతో మినిట్ టూ మినిట్ ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ ను ఈ యన్ సి నల్ల వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిఘె శన్ సలహాదారు పెంట రెడ్డి,ఈ ఈ శ్రీదర్ లు నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు.

Water flow continues to kaleshwaram water….Water flow continues to kaleshwaram water…Water flow continues to kaleshwaram water

- Advertisement -