బెంగళూరులో నీటి కటకట!

3
- Advertisement -

కర్ణాటక రాష్ట్రంలో నీటి కటకట ఏర్పడింది. వేసవి ప్రారంభంలోనే నీటి కొరత ఏర్పడటంతో ముందస్తు చర్యలు చేపట్టింది బెంగళూరు వాటర్ బోర్డు. త్రాగునీటిని వాహనాలు కడగడానికి, తోటల పెంపకానికి, నిర్మాణ పనులకు, ఫౌంటెయిన్‌లకు ఉపయోగించినట్టు గుర్తిస్తే రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ఒకసారి జరిమానా చెల్లించిన తర్వాత కూడా మళ్లీ అదే తప్పు చేస్తే అదనంగా మరో రూ. 5,000 మరియు రోజుకు రూ. 500 చొప్పున ఫైన్ విధిస్తామని స్పష్టం చేసింది.ఈ చర్యలు వాటర్ బోర్డ్ యాక్ట్‌లోని సెక్షన్ 109 ప్రకారం అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే నీటిని వృథా చేస్తుంటే సమాచారం ఇవ్వాలని ఇందుకు సంబంధించి కాల్ సెంటర్ నెంబర్ 1916కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల భూగర్భ జలాలు మరింత వేగంగా అడుగంటే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుండే చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు.

Also Read:హరిహర వీరమల్లు..మళ్లీ సస్పెన్స్‌లో!

- Advertisement -