తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ ..

298
telangana projects
- Advertisement -

తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ఉదృతి కొనసాగుతోంది.8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు.ఎగువ ,దిగువ కేంద్రాల్లో విద్యుత్పత్తి కొనసాగుతోంది.నారాయణ పుర నుండి 45,970 క్యూసెక్ లు జూరాలకు వదులుతుండగా ఆల్మట్టి నుండి నారాయణ పుర డ్యామ్ కు 40,000 క్యూసెక్ ల ఇన్ ఫ్లో ఉంది.

నారాయణ పుర ప్రాజెక్ట్ దిగువన కురుస్తున్న వర్షాలతో జూరాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది.ఇన్ ఫ్లో: 75,000 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో: 88,764 క్యూసెక్కులు
,పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం: 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీట్టి నిల్వ: 8.810 టీఎంసీలు,పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ,ప్రస్తుత నీటి మట్టం: 318.100 మీ.

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది . ఇన్ ఫ్లో : 87 వేల 317 క్యూసెక్కులు ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు.ప్రస్తుతం నీటి మట్టం : 835.60 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు. ప్రస్తుతం నీటి నిల్వ : 55.87 టి.ఎం.సి లు.

సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టు ప్రాజెక్టు సామర్థ్యం 45,77 TMC లు.ప్రస్తుతం నీటి నిల్వ. 9.57 tmc .లుఇన్ ప్లో : 2149.క్యూసెక్కులు.అవుట్ ప్లో : 100.
క్యూసెక్కులు.

నిజామాబాద్ :శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు 8,630 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, ప్రస్తుతం 1073.2 అడుగులు,ప్రాజెక్ట్ సామర్థ్యం 90 TMC లు, ప్రస్తుతం 35.677 TMC లు.

నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులు,,ప్రస్తుత నీటిమట్టం: 529.90 అడుగులు,ఇన్ ఫ్లో : 2633 క్యూసెక్కులు,అవుట్ ఫ్లో : 2633 క్యూసెక్కులు,పూర్తిస్థాయి నీటి నిల్వ :312.0405 టీఎంసీలు,ప్రస్తుత నీటి నిల్వ : 167.9514 టీఎంసీలు.

- Advertisement -