రోహిత్,విరాట్ కొనసాగుతారా?

1
- Advertisement -

2027 వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే అంశంపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.2027 వన్డే ప్రపంచకప్ టోర్నీ దక్షణాఫ్రికా వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జట్లన్నీ ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించాయి. అయితే భారత జట్టు తయారీలో అందరి మనస్సులో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న.. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ టోర్నీలో ఆడతారా లేదా అని! ఇప్పటికే టి20లు, టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు తమ కెరీర్ ముగింపు దశలో ఉన్నారు. దీంతో వారి వన్డే రిటైర్మెంట్ కూడా దగ్గరపడిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఈ అంశంపై తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన వసీం జాఫర్.. రోహిత్, విరాట్‌ల భవిష్యత్తుపై కీలక అభిప్రాయాన్ని పంచుకున్నారు. రోహిత్ శర్మ గురించి ఎలాంటి చర్చ జరుగుతుందో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది. కానీ నా అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ ఖచ్చితంగా ప్రపంచకప్ ఆడాలి. రోహిత్ ఆడుతున్నాడంటే అతని దృష్టి మొత్తం ఆ వరల్డ్ కప్‌పైనే ఉంటుంది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే అతనే స్వయంగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. రోహిత్ అయినా, విరాట్ అయినా.. వారు 2027 ప్రపంచకప్ దాటి ముందుకు వెళ్తారని నేను అనుకోవడం లేదు. ఆ తర్వాత మళ్లీ ప్రపంచకప్ రావడానికి నాలుగేళ్లు పడుతుంది కాబట్టి వారు అంత దూరం ఆలోచిస్తారని నేను అనుకోను అని జాఫర్ వ్యాఖ్యానించారు.

Also Read:కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం

భారత జట్టు తమ తదుపరి వన్డే సిరీస్‌ను వెస్టిండీస్‌తో ఆడనుంది. ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 5 టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ వన్డే సిరీస్‌లో రోహిత్, విరాట్ ఇద్దరూ బరిలోకి దిగే అవకాశం ఉంది.సెప్టెంబర్ 27, సెప్టెంబర్ 30 మరియు అక్టోబర్ 3 తేదీల్లో తిరువనంతపురం, గౌహతి మరియు న్యూ చండీగఢ్‌లలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జరగనున్న ఈ సిరీస్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.

- Advertisement -