కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం

3
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం హెచ్చరికలు, రాజీనామా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖను తమ ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

హైదరాబాద్‌లో గురువారం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలపై స్పందించారు. మీకు అండగా ఉండటానికి ప్రజాశాంతి పార్టీ ఉంది, మీరు వేరే ఏ పార్టీలోకి వెళ్లొద్దు అని ఆమెకు సూచించారు. ప్రజాశాంతి పార్టీలోకి వస్తే తగిన గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేఏ పాల్, ఆ పార్టీలో బీసీ నాయకత్వానికి రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గానికి చెందిన నాయకుల పదవులకు ఎలాంటి డోకా ఉండదు. అక్కడ కేవలం బీసీ నాయకుల పదవులకే ముప్పు మరియు ప్రమాదం పొంచి ఉంది అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Alos Read:మంత్రి పదవికి కొండా రాజీనామా?

బడుగు, బలహీన వర్గాలకు మరియు బీసీలకు నిజమైన నాయకత్వం, న్యాయం జరగాలంటే దేశంలో మరియు రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ ఒక్కటే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు. అధిష్ఠానం తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కొండా సురేఖ ప్రజాశాంతి పార్టీలోకి రావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.

- Advertisement -