మంత్రి ఎర్ర‌బెల్లిని క‌లిసిన వ‌రంగ‌ల్ మేయ‌ర్..

35
Minister Errabelli

నూత‌నంగా ఎన్నికైన గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ మేయ‌ర్ గుండు సుధారాణి ఆదివారం హైద్రాబాద్‌లో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి పుష్ప‌గుఛ్చం అంద‌జేశారు. ఈ సంధ‌ర్భంగా మేయ‌ర్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్దికి కృషి చేస్తూ.. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించి ప్ర‌భుత్వానికి మంచి పేరు తీసుకురావాల‌ని సూచించారు.