కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ సమీక్ష..

58

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వయంగా వైద్యఆరోగ్యశాఖ బాధ్యతలు చూస్తున్న ఆయన అధికారులతో వరుస భేటీలు జరుపుతున్నారు. తాజాగా మరోసారి కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు వైద్యఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు.

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వేతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. అధికారులతో సమీక్ష అనంతరం కరోనా కట్టది దిశగా మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీకెండ్ లాక్‌డౌన్ అంశాన్ని కూడా పరీలించనున్నట్లు తెలుస్తోంది.