రంగశాయిపేట, ఉర్సుగుట్ట, కాశిబుగ్గ తదితర ప్రాంతాల్లో జరిగిన దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సంప్రదాయ పట్టు వస్త్రాలు, పంచెతో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి..ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియ చేశారు.
ఈ ప్రాంతాలతో నాకు చిన్ననాటి నుంచే ఎంతో అనుబంధం ఉందని…చిన్నప్పుడు, చదువుకునేప్పుడు, రాజకీయ నేతగా, ఇప్పుడు మంత్రిగా నాకు ఇప్పటికీ ఎనలేని అనుబంధం ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయమే ఈ విజయదశమి…మనం ఉమ్మడి రాష్ట్ర పాలకుల వివక్షను, దాష్టీకాన్ని ఎదురించి, ధిక్కరించి, పోరాడి తెలంగాణను కెసిఆర్ నాయకత్వంలో సాధించుకున్నాం అన్నారు.
సాధించిన తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా సిఎం కెసిఆర్ తీర్చిదిద్దుతున్నారని…అభివృద్ధి, సంక్షేమం, పథకాలు, వాటి అమలు…ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమానికి ఇంకా కొందరు అడ్డు పడుతూనే ఉన్నారు..అలాంటి వాళ్ళకి నాడు పట్టిన గతే పట్టాలని కోరుకుందాం అన్నారు. వరంగల్ సమగ్ర అభివృద్ధికి కుడా మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని…సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ఆ ప్లాన్ ని త్వరలోనే ఆవిష్కరింప చేసుకుందాం అన్నారు.ఉర్సు, రంగశాయిపేట, కాశీబుగ్గ లాంటి పలు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి మరిన్న ప్రణాళికలు అవసరం..స్థానిక ఎమ్మెల్యే, మహిళా సాధికారత సంస్థ చైర్ పర్సన్, కార్పొరేటర్లు, ఇతర స్థానిక నేతలంతా కలిసి ఆయా ప్రణాళికల రూపకల్పన చేశారన్నారు.