వరంగల్‌కి పూర్వవైభవం తెస్తాం: మంత్రి ఎర్రబెల్లి

82
dayakarrao

వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి ఆల‌యంలో దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా నిర్వ‌హిస్తున్న తెప్పోత్స‌వంలో పాల్గొన్నారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి…తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు.

జ‌గ‌న్మాత కాక‌తీయ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి ఆశిస్సులు అంద‌రిమీదా ఉండాలన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ఇంకా అద్భుత ప్ర‌గ‌తిని సాధించాలి…తెలంగాణ దేశానికే ఆద‌ర్శంగా నిల‌వాలన్నారు. హైద‌రాబాద్ త‌ర్వాత వ‌రంగ‌ల్ అన్ని రంగాల్లో అగ్ర‌గామిగా అభివృద్ధి సాధించాలని…క‌రోనా నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు సాధ్య‌మైనంత తొంద‌ర‌లోనే కోలుకోవాల‌ని కోరుకున్నానని తెలిపారు.

ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో, శాంతి సౌభాగ్యాల‌తో ఉండాల‌ని ఆకాంక్షించాను…ఈసారి తెప్పోత్స‌వ వాహ‌నంలో పూజారులు త‌ప్ప మరెవ‌రూ కూర్చోవ‌ద్ద‌ని నిర్ణ‌యించామన్నారు. సాహిత్య‌, సాంస్కృతిక, దైవిక, పండుగ‌ ఉత్స‌వాల‌కు పెట్టింది పేరు వ‌రంగ‌ల్ అన్నారు. ఆ ఒర‌వ‌డిని తెలంగాణ ప్ర‌భుత్వం వైభ‌వంగా కొన‌సాగిస్తున్న‌ది…వ‌రంగ‌ల్ కి పూర్వ వైభ‌వం తేవ‌డ‌మే సిఎం కెసిఆర్ , మంత్రి కెటిఆర్ ల ల‌క్ష్యం అన్నారు.