గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ మహేందర్‌..

111
gc

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జి శ్రీనివాస్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా విసిరినా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు వరంగల్ రూరల్ అడిషనల్ కలెక్టర్‌ మహేందర్.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి సంవత్సరం పాల్గొని పలువురిని భాగస్వామ్యం చేస్తానని , ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందించవచ్చు , మొక్కలు నాటడం సకాలంలో వర్షాలు పడుతాయని ,పర్యావరణ పరిరక్షణ కు ఎంతో దోహదపడుతుందన్నారు.

ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం లో పాల్గొనాలని మూడు మొక్కలు నాటి మూడు సంత్సరాలు కాపాడే బాధ్యత తీసుకోవాలని కోరారు . ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మరో ముగ్గురికి శ్రీ వెంకటేశ్వర్లు అడిషనల్ కలెక్టర్ మహబూబాబాద్ , మహేందర్ ఆర్డీవో వరంగల్ రూరల్ , ఎల్ కిషన్ ఆర్డీవో పరకాలకి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు.