తెరచుకున్న థియేటర్లు…ఎక్కడో తెలుసా!

151
coronavirus
- Advertisement -

లాక్ డౌన్ కారణంగా దేశంలో దాదాపు ఏడూ నెలలుగా సినిమా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన అనుమతితో అక్టోబర్ 15 నేటి నుంచి సినిమా హాల్స్ , మల్టీ ప్లెక్స్ లు రీఓపెన్ కానున్నాయి. లాక్ డౌన్ 5.0లో భాగంగా 15 రాష్ట్రాల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు ఓపెన్‌ కానుండగా తెలుగు థియేటర్ల ఓపెనింగ్‌కి మాత్రం బ్రేక్ పడింది.

తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల రీ-ఓపెన్ కు అనుమతి ఇవ్వలేదు. ఇక ఏపీలోనూ 13 జిల్లాల సినిమా ఎగ్జిబిటర్లు థియేటర్లు తెరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లు తెరవాలంటే ఒక్కో దానికి రూ. 10 లక్షల అదనపు ఖర్చు అవుతుందని, 50 శాతం ఎక్కుపెన్సీ తో థియేటర్ల నిర్వహణ కష్టమని ఎగ్జిబిటర్లు భావించి..ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ఓపెనింగ్‌ ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

- Advertisement -