భారత ఆపరేషన్‌కు అమెరికా మద్దతు..

264
- Advertisement -

పాకిస్తాన్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయమని కేంద్రం ప్రకంటించింది. పాక్ సరిహద్దు రాష్ట్రాలైన . జమ్మూకశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ల ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసి భారీగా రక్షణ బలగాలను మొహరించారు. అంతర్జాతీయ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ గ్రామాలను బీఎస్ఎఫ్ ఖాళీ చేయిస్తోంది. మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

ajith doval

ఉగ్రవాదులపై భారత సైన్యం చేసిన దాడికి ప్రపంచ దేశాలన్నింటి నుంచి మద్దతు లభిస్తోంది. అమెరికా సైతం ఈ దాడులపై స్పందించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌ పోరాడాలని.. ఆ దేశం నుంచి తాము అదే ఆశిస్తున్నామని అమెరికా భద్రతా సలహాదారు సూసన్‌ రైస్‌ అన్నారు. ఈ మేరకు ఇటీవల జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉరీ ఉగ్రదాడి ఘటనపై భారత భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో ఫోన్లో మాట్లాడిన రైస్‌.. పాకిస్థాన్‌ గురించి ప్రస్తావించినట్లు అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్‌ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ తెలిపారు.

ఉరీ దాడి అనంతరం తొలిసారిగా దోవల్‌తో మాట్లాడిన సూసన్‌.. ఘటనను తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా గుర్తించిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ లాంటి సంస్థలకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ పోరాడాలని, వాటిపై కఠినచర్యలు తీసకోవాలని తాము ఆశిస్తున్నట్లు సూసన్‌ అన్నారు.

pm modi

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అఖిలపక్ష భేటీకి రావాలని సీతారాం ఏచూరి, గులాం నబీ ఆజాద్‌ సహా విపక్ష నాయకులందరికీ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమాచారం ఇచ్చారు. భారత సైనిక చర్యపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

- Advertisement -