వాల్ నాట్స్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

140
- Advertisement -

వాల్ నాట్స్ చూడడానికి మనిషి మెదడు ఆకారంలో ఉండే ఇవి ఎన్నో పోషక విలువలను కల్గిఉంటాయి. నాట్స్ అన్నిటిలోకెల్లా బలమైన ఆహారంగా వాల్ నాట్స్ ను చెప్పుకోవచ్చు. ఇందులో ఒమేగా 3 ఫాటి యాసిడ్, విటమిన్ ఇ, విటమిన్ బి, విటమిన్ కె, ఫైబర్, కాల్సియమ్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మెదడును చురుకుగా ఉంచుతూ జ్ఞాపకశక్తిని పెంపొండించడంలో సహాయపడతాయి. ఇక వాల్ నాట్స్ ను ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయాన్నే ఈ వాల్ నాట్స్ తినడంవల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి.

ఇక వాల్ నాట్స్ లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ శరీరంలోని రోగ నిరోదక శక్తిని పెంపొండించడంలో సహాయపడతాయి. వాల్ నాట్స్ లో సాచూరేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధ పడేవారు వాల్ నాట్స్ తినడం ద్వారా ఆ సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. షుగర్ పేషెంట్స్ కు వాల్ నాట్స్ అద్భుత ఔషధంలా పని చేస్తాయి ఇందులో ఉండే భాస్వరం, సెలీనియం వంటివి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. వాల్ నాట్స్ లో కాల్సియమ్ కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల ఎముకలు దంతాలు దృఢంగా మారతాయి. ఇక మగవారిలో వీర్య కణాల వృద్దిని పెంచడంలో కూడా వాల్ నాట్స్ కీలక పాత్ర పోషిస్తాయట. తద్వారా సంతనలేమీ సమస్య దూరం అవుతుంది. రెండు వాల్ నాట్స్ ను రాత్రంతా నానబెట్టి ప్రతిరోజూ ఉదయాన్నే పడగడుపున తింటే చక్కటి పోషకాలు శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి…

త్వరగా బరువు పెంచే ఆహార పదార్థాలు!

గ్యాస్ సమస్యలను దూరం చేసే ‘యోగముద్రాసనం’!

జులై 1న గ్రూప్-4 పరీక్ష…

- Advertisement -