ఆసియా కప్‌కు భారత కోచ్‌గా లక్ష్మణ్

111
laxman
- Advertisement -

ఆసియా కప్‌ భారత జట్టు కోచ్‌గా వ్యవహరించనున్నారు వీవీఎస్ లక్ష్మణ్. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ కరోనా బారిన పడటంతో ఆయన స్ధానంలో లక్ష్మణ్‌ని కోచ్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. ఆసియా కప్ పూర్తయ్యే వరకు హెడ్ కోచ్‌గా లక్ష్మణ్ వ్యవహరిస్తారని బీసీసీఐ తెలిపింది.

రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం కోవిడ్ చికిత్స పొందుతున్నారని, ఆయన కోలుకున్న తర్వాత తిరిగి జట్టుతో చేరుతారని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సిరీస్‌లో ఇండియా ఘన విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నెల 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, కే.ఎల్.రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

- Advertisement -