ప్రియాంక గాంధీతో ఎంపీ వెంకట్‌రెడ్డి భేటీ

63
- Advertisement -

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పీసీసీ చీఫ్ రేవంత్‌తో విభేదాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు ఉప ఎన్నిక, పార్టీలో అవమానాలు, పిసిసిపై తన అసంతృప్తిని ప్రియాంకకు వివరించే అవకాశం ఉంది.

తన పట్ల, తన కుటుంబం పట్ల పిసిసి చేసిన వ్యాఖ్యలు,పార్టీలో తనకు చెప్పకుండా చెరకు సుధాకర్ ను చేర్చుకోవడం, మునుగొడులో సభలు సమావేశాలు పెట్టడంపై వెంకట్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు.

అయితే ఈ భేటీ తర్వాత కోమటిరెడ్డి మనసు మార్చుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -