Ram Mandir:తరలిరానున్న ప్రముఖులు వీళ్లే

32
- Advertisement -

ఐదు శతాబ్దాల కల మరో రెండు రోజుల్లో నెరవేరనున్న సంగతి తెలిసిందే. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22న జరగనుండగా అభిజిత్ లగ్నంలో జరగనుంది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దేశ,విదేశాల ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.

మొత్తంగా 8 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఇందులో పారిశ్రామిక వేత్తలు ముఖేష్‌ అంబానీ, అతని కుటటుంబంతో పాటు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు ఆహ్వానాలు అందాయి. అలాగే సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.

సినీ నటులు చిరంజీవి, అజయ్‌ దేవగన్‌, అక్షయ కుమార్‌, అల్లు అర్జున్‌, మోహన్‌ లాల్‌, అనుపమ్‌ ఖేర్‌, అహ్మద్‌ అలీ, గీత రచయిత మనోజ్‌ ముంతాషీర్‌, అతని భార్య, గీతా రచయిత భన్సాలీ, చంద్రప్రకాష్‌ ద్వివేదీతో పాటు పలువురు ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా, అతని భార్య నీర్జా, పిరమల్‌ గ్రూప్‌ చైర్మన్‌ అజయ్‌ పిరమల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థల చైర్మన్‌ ఆనంద్‌ మహీంధ్ర, టీసీఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కె కీర్తివాసన్‌ ఉన్నారు. డాక్టర్‌ రెడ్డిస్‌ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన కె సతీష్‌ రెడ్డి, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సీఈవో పునీత్‌ గోయెంకా, లార్సెన్‌ అండ్‌ టూబ్రో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణియన్‌, ఆయన భార్య, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ చీఫ్‌ నవీన్‌ జిందాల్‌, వేదాంత గ్రూప్‌కు చెందిన నరేష్‌ ట్రెహాన్‌కు ఆహ్వానాలు అందాయి. అలాగే పలువురు క్రీడాకారులకు ఆహ్వానాలు అందాయి.

Also Read:ఉసిరిరసంతో ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -